జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలు
1 min read– కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ’21’వ జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలను జయప్రదం చేయాలని ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్నూలు మాజీ ఎమ్మెల్యే నేడు ఎస్వీ కాంప్లెక్స్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీలతో పాటు సామాజిక దృక్పథం పై చిన్ననాటినుండే అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో సామాజిక సమస్యల పైన వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు, తెలుగు షార్ట్ ఫిలిం పోటీలు, నృత్య రూపక పోటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజేతలకు డిసెంబర్ 18వ తేదీన బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందన్నారు. ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీలను ప్రోత్సహించాలన్నారు. నిర్వాహకులు కార్యక్రమం వివరాలు వివరించారు .ఈనెల 30న జాతీయస్థాయి శాస్త్రీయ నృత్య పోటీలు, ప్రపంచ శాంతి పై జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు,మానవ హక్కుల పరిరక్షణ అంశంపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలు కృష్ణా నగర్ రైల్వే గేట్ సమీపంలో శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో ఉంటాయని మరియు నవంబర్ 6వ తేదీన జాతీయ స్థాయి తెలుగు షార్ట్ ఫిలిం పోటీలు ,తెలుగు టీవీ సీరియల్ లు- కుటుంబం పై ప్రభావం అనే అంశంపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలు, పర్యావరణ పరిరక్షణ పై జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించబడతాయి, మరియు నవంబర్ 13వ తేదీన ఉదయం 9 గంటల నుండి జాతీయ స్థాయి గ్రామీణ/ జానపద నృత్య పోటీలు, జాతీయ స్థాయి గ్రామీణ/ జానపద పాటలు పోటీలు, సమాచార హక్కు చట్టం అంశంపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలు , జాతీయ స్థాయి శాస్త్రీయ లలిత సంగీత పోటీలు ఉంటాయన్నారు. మరియు నవంబర్ 20 వ తేదీన సామాజిక సమస్యలపై జాతీయస్థాయి నృత్య రూపక పోటీలు , వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు ,జాతీయ స్థాయి ఆధునిక పాటల పోటీలు, తెలుగు భాషా పరిరక్షణ మన వంతు బాధ్యత అనే అంశంపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలు ఉంటాయి మరియు నవంబర్ 27న జాతీయ స్థాయి యోగా పోటీలు ,ఆధునిక జీవన దృక్పథంలో యోగ ప్రాముఖ్యత అంశంపై జాతీయ స్థాయి వ్యాసరచన పోటీలు, జాతీయ స్థాయి లైవ్ డాన్స్ పోటీలు ఉంటాయి మరియు డిసెంబర్ 4న జాతీయస్థాయి ఆధునిక నృత్య పోటీలు ఉంటాయి. చివరిగా డిసెంబర్ 18న అన్ని పోటీలో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం ఉంటాయి. వివరాలకు మరియు తమ పేరు నమోదు కొరకు వెంకటరమణ కాలనీ మొదట లైన్లో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో సంప్రదించవచ్చు లేదా 93 968 61308 నంబరు ద్వారా సంప్రదించవచ్చు అని నిర్వాహకులు తెలియజేశారు . కార్యక్రమంలో యువ నాయకుడు ఎస్. వి .జనక దత్త రెడ్డి, సంచారజాతుల డైరెక్టర్ షరీఫ్, మాజీ కార్పొరేటర్ రమణ తదితరులు పాల్గొన్నారు.