సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు లోన్ యాప్స్ పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సిఐ చంద్రబాబు నాయుడు విద్యార్థులకు సూచించారు. రుద్రవరం ఆదర్శ పాఠశాల నందు సైబర్ నేరాలు లోన్ యాప్స్ వాటి వల్ల కలిగే నష్టాలు సమస్యలపై విద్యార్థులకు సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చెడు మార్గాలలో నడవకుండా అందరినీ చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యమని విద్యార్థి దశలోనే సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఉమెన్ సేఫ్టీ. షీ టీం సెల్‌ఫోన్లు అంతర్జాలం ఆన్‌లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ముఖ్యంగా మహిళలు పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు వేధింపులు అధికమవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్‌లైన్ చదువు మాత్రమే కాకుండా వైద్యం అమ్మకాలు కొనుగోళ్లు ఉద్యోగాలు లావాదేవీలు ఇలా ఎన్నో అంశాలు ఆన్‌లైన్ వేదికగా కొనసాగుతున్నాయని ప్రస్తుత సమాజంలో సెల్‌ఫోన్లు అంతర్జాలం వినియోగం తప్పనిసరైందని ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆన్‌లైన్‌లో తరగతులు వింటున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ కి పిల్లలు ఎవరుకుడా స్పందించవద్దని అలాగే గుర్తుతెలియని వ్యక్తులతో ఓటిపిలను పంచుకోవద్దని మీరు బహుమతులు గెలుచుకున్నారు అంటూ వచ్చే సందేశాలకు కూడా ఎవరూ స్పందించవద్దని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సురేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు పోలీసులు పాల్గొన్నారు.