తెర పైకి కోడికత్తి కేసు
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా జరిగిన కోడికత్తి దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు నిరసన దీక్షకు దిగనున్నారు. నాలుగేళ్లుగా రాజమండ్రి సెంటర్ జైలులో ఉన్న జనుపల్లి శ్రీనివాస్ కు బెయిల్ రాకపోవడంతో ఆమరణ దీక్ష చేస్తామని చెబుతున్నారు. కోనసీమ జిల్లా ఠాణేలంకతో నివాసముంటున్న శ్రీనివాస్ తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు తమ కుమారుడ్ని విడుదల చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 అక్టోబరు 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టు లో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ పై శ్రీనివాస్ దాడిచేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.