PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకులను… ఎస్టీ జాబితాలో చేర్చొద్దు.. : ఇస్లావత్ కాలునాయక్

1 min read

రాష్ట్ర ఎస్టీ ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కాలునాయక్…

పల్లెవెలుగువెబ్, ఓర్వకల్: కర్నూలు జిల్లా ఓర్వకల్ మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో  ఎస్టి.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఇస్లావత్ కాలు నాయక్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ వాల్మీకి బోయాబెంతు ఒరియాల కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం మరియు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యా.. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇప్పటికీ మా గిరిజనలు అడవిలోనే జీవనం సాగిస్తున్నాము, కానీ ఇప్పటికీ మార్పులేని సామ్రాజ్యంలో గిరిజనులు జీవనం సాగిస్తు అయోమయ పరిస్థితుల్లో తిని తిని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ, వాల్మీకులు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెంది ఉన్నారు, వారికి మాకు రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య గొడవ పెడుతున్నారు, ఇది ఎంతవరకు సాధ్యం. కావున వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని  చేస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షలు ఎస్. టి. ఎఫ్ జిల్లా అధ్యక్షులు  నేనావత్ రాము నాయక్ మాట్లాడుతూ ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు ఎస్సీ ఎస్టీ స్పెషల్ డ్రైవ్ ఉద్యోగాలు లేవు, ఇంతవరకు ఎస్టీలకు అభివృద్ధి దిశా మార్గం లేదు, మరి ఎస్టీలు ఏ విధంగా ఎదుగుతారు ఎస్టీ విద్యార్థులు డిగ్రీలు, పీజీలు, బీఏ డీ లు, ఎల్ఎల్బీలు పీహెచ్డీలు, చేసుకొని ఉద్యోగాలు లేక ఆర్థికంగా  ఎదగలేక కొండలకు గుట్టలకు పరిమితమైనారు. ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. దీనితోపాటు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం ఎంతవరకు న్యాయం అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ వాల్మీకులను ఎస్టీ జాబితాలలో చేర్చే ఆలోచన విరమించుకోవాలని, అలాగే భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. అ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో. ఎస్ టి .ఎఫ్ నాయకులు రామ్ నాయక్.. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి రమేష్.. బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు జి మునిస్వామి. తదితరులు పాల్గొన్నారు.

About Author