థర్మల్ స్కానర్తో.. టెంపరేచర్ చూడండి
1 min read– ఫీవర్ సర్వే బృందాన్ని ఆదేశించిన కలెక్టర్ ఎస్. వెంకటరావు
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్: జిల్లాలోని ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా ఫీవర్ సర్వే చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. శనివారం మహబూబ్నగర్ పట్టణంలోని ఝాన్సీ నగర్ ,హనుమాన్ నగర్ లో ఫీవర్ సర్వే బృందాల పనితీరును కలెక్టర్ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు థర్మల్ స్కానర్ ద్వారా టెంపరేచర్ చెక్ చేయాలని ఫీవర్ సర్వే బృందాలను ఆదేశించారు. కాలనీ వాసులతో కలెక్టర్ సర్వే గురించి అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందాలు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారా ? ఎలాంటి వివరాలు అడుగుతున్నారు ? జ్వరం ,దగ్గు, జలుబు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారా? మీరందరూ పూర్తి వివరాలను సర్వే బృందానికి ఇస్తున్నారా? అని అడిగారు. ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే సర్వే బృందానికి తెలియజేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ తదితరులు ఉన్నారు.