అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా నిలవాలి
1 min read– పోలీసు అమరవీరుల స్ధూపానికి ఘనంగా నివాళులు అర్పించిన …
– కర్నూల్ రేంజ్ డీఐజీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ .విధి నిర్వహణలో అశువులు బాసిన .
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో(01.09.2021 నుండి 31.08.2022) ప్రాణ త్యాగాలు చేసిన 261 మంది పోలీసులకు ఘన నివాళి .విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన భాద్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని కర్నూల్ రేంజ్ డీఐజీ శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపీఎస్ గారు, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారులు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు.కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపిఎస్ గారు, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారులు స్మృతి పరేడ్ కు హజరై, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సెంథిల్ కుమార్ ఐపియస్ గారు మాట్లాడుతూ…పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రతి ఏడాది ఈ అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల దినోత్సవం ను దేశం మొత్తం జరుగుతుందన్నారు. 1959 లో అక్టోబర్ 21 న చైనా సైనికులను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన పోలీసు వారి ధైర్యాని, త్యాగాన్ని అమరవీరుల స్మారక దినంగా మన దేశం గత 62 ఏళ్లుగా గుర్తుచేసుకుంటుందన్నారు.ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ప్రతి పోలీసు కుటుంబానికి మొత్తం సమాజం జే జే లు పలుకుతుందన్నారు.గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 261 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 08 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అందులో మన కర్నూల్ రేంజ్ పరిధిలో కానిస్టేబుల్ జి. సురేంద్రనాథ్ – నంద్యాల జిల్లా, హోంగార్డు కె. రాజశేఖర్ – కర్నూలు జిల్లా వీరిద్దరు అమరులైనారన్నారు.అమరవీరుల కుటుంబాలకు ఎల్లవేళల అండగా వుండి పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఫ్యామిలి నందు ఒక్కరికి ఉద్యోగం, భద్రత నుండి రూ. 8 లక్షలు, ఫ్యామిలి కి నెల నెల పెన్షన్, పోలీసు శాలరీ ప్యాకేజ్ నుండి రూ. 3 లక్షలు , అంత్యక్రియలకు రూ. 25 వేలు , ఫ్లాగ్ ఫండ్ నుండి రూ. 25 వేలు , విడో ఫండ్ నుండి రూ. 50 వేలు ఈ విధంగా అమరులైన పోలీసు కుటుంబాలకు చేయూతగా ప్రభుత్వం ద్వారా సాయం అందిస్తున్నామన్నారు.జిల్లా కలెక్టర్ శ్రీ పి. కోటేశ్వరరావు ఐఏయస్ గారు మాట్లాడుతూ… 1959 అక్టోబర్ 21న జరిగిన దురదృష్ట సంఘటన ను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను సంస్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని శాంతి భద్రతల కట్టడిలో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. సమాజంలో ప్రజలు నిద్రలేచింది మొదలు మరలా నిద్రకు ఉపక్రమించేంతవరకు ప్రశాంతంగా ఉన్నామంటే దేశ, రాష్ట్ర భద్రతలో పోలీసు వ్యవస్థే నన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయింబవళ్ళు దేశ భధ్రతలో జీవితం మొత్తం రోడ్ల పై, సరిహద్దులలో త్యాగం చేస్తున్నారన్నారు. పోలీసుల సేవలను మర్చిపోలేమన్నారు. అందరం ప్రశాంతంగా ఉంటున్నామంటే అది పోలీసుల త్యాగమేనన్నారు.సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, గౌరవించి, దేశ వ్యాప్తంగా అమరవీరుల దినోత్సం రోజును జరుపుకుంటూ అమరవీరులకు శ్రధ్దాంజలి నిర్వహిస్తున్నామన్నారు. 01.09.2021నుండి 31.08.2022 నాటికి దేశవ్యాప్తంగా 261 మంది పోలీసులు వీరమరణం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్ బాబు, కెవి మహేష్, ఇలియాజ్ భాషా, డిపిఓ ఎఓ సురేష్ బాబు, పోలీసు వేల్పేర్ డాక్టర్ శ్రీమతి స్రవంతి గారు, సిఐలు, ఆర్ ఐలు పాల్గొన్నారు.