దామోదరం సంజీవయ్య జీవితం… ఆదర్శం
1 min readపల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్: నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య దేశానికి చేసిన సేవలు.. చిరస్మరణీయమని జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా ప్రెసిడెంట్ కాను గడ్డ యాదయ్య అన్నారు. ఆయన జీవితం.. ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు. సంజీవయ్య 49వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాను గడ్డ యాదయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో జన్మించిన దామోదరం సంజీవయ్య.. 1962లో ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా పని చేశారని, రాజ్య సభ ఎంపీగా. ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నా.. నిరాడంబర జీవితాన్ని గడిపాడని, ఆయన అనేకసార్లు మంత్రి పదవులు, రెండు సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పని చేశారని గుర్తు చేశారు. దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కాను గడ్డ యాదయ్య పిలుపునిచ్చారు. సంజీవయ్య వర్ధంతి, జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బా రాములు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.