రెవల్యూషనరీ విద్యార్థి సంఘం లోగో ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ: శుక్రవారంనాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ సందర్భంగా ఆర్.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని గత కాంగ్రెస్ రెండు రాష్ర్టాలుగా విభజన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలను గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రప్రజల ఆకాంక్షను డిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సం ॥ అవుతున్నా కూడా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడ తేగపోగా, ఆంధప్రజల హక్కు అయినా ” విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర, రాష్ట్ర అభుత్వాలు కంకణం కట్టుకోవడం చాల దుర్మార్గమని ఆయన వాపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారం లోకి రాకముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి అధికారం లోకి వచ్చిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు అవుతున్న కూడా నిరుద్యోగ విద్యార్థులు సమస్యలను పెడచెవిన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా ఐదు కోట్ల ఆంధ్రప్రజల హక్కుల సాధన కోసం విద్యార్థి నిరుద్యోగుల సమస్యల కోసం నేటి నుండి రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ కోసం గత 8 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశామని, గత నెలలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర ప్లీనరీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో జరుగుతుటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహించాలని రాయలసీమ విద్యార్థి సంఘాన్ని నేటి నుండి రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ గా మార్చడం జరిగిందని ఆర్.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.విభజన హామీలను అమలు చేయాలని, విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్.ఎస్.యు ఉద్యమాన్ని ఉద్భతం చేస్తామని ఆయన హెచ్చరించారు.రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ కోసం గత 8 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశామని, గత నెలలో నంద్యాలలో జరిగిన రాష్ట్ర ప్లీనరీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో జరుగుతుటువంటి సమస్యల పైన పోరాటాలు నిర్వహించాలని రాయలసీమ విద్యార్థి సంఘాన్ని నేటి నుండి రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ గా మార్చడం జరిగిందని ఆర్.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.విభజన హామీలను అమలు చేయాలని, విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్.ఎస్.యు ఉద్యమాన్ని ఉద్భతం చేస్తామని ఆయన హెచ్చరించారు.