PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట నమోదు..

1 min read

– క్షేత్రస్థాయిలో పర్యటించిన మండల వ్యవసాయ అధికారి.. హేమ సుందర్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్​ గడివేముల: గడివేముల మండలంలోనిఈక్రాప్ పంటలకు క్షేత్ర స్థాయి సందర్శనచేసినట్టు శుక్రవారం నాడు మండల వ్యవసాయ అధికారి హిమసుందర్ రెడ్డి తెలిపారు మండల పరిధిలోని ఈ క్రాప్ కు సంబంధించి 5809 మంది రైతులకు మొక్కజొన్న ,పత్తి, కంది ,మిరప ,ఆముదాలు, మినుము, సోయాబీను ,వరి, అరటి ,మామిడి , చీని, సీతాఫలం ,జామ, బెండ, చిక్కుడు ,ఉల్లిగడ్డలు, టమోటాలు, తదితర పంటలను దాదాపు 19790 ఎకరాలలో పంట నమోదు చేయడం జరిగిందన్నారు . అదే విధంగా రైతులతో వాటికి సంబంధించి బయోమెట్రిక్ వేయించినట్టు తెలిపారు .ఈ రోజు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ పంట నమోదు సూపర్ చెక్ లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో క్షేత్ర ప్రదర్శన చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తెలిపారు.

About Author