సంస్కృతం మాట్లాడే గ్రామం !
1 min readపల్లెవెలుగువెబ్ : అసోంలోని ఓ గ్రామంలో అచ్చంగా సంస్కృతమే మాట్లాడతారంటే నమ్మశక్యం కాని విషయం. కానీ నమ్మక తప్పదు. ఈ ఊరి పేరు పాట్యాలా. ఈ గ్రామం కరీంగంజ్ జిల్లాలోని రటబారి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ సంస్కృతమే మాట్లాడతారు. పాట్యాలా గ్రామాన్ని ‘సంస్కృత గ్రామం’ అని పిలుస్తారు. ఇక్కడ 2015 నుంచి సంస్కృతమే వాడుక భాషగా కొనసాగుతోంది. ఈ ఊర్లో 60 కుటుంబాలు ఉంటాయి. మొత్తమ్మీద 300 మంది జనాభా కలిగిన పాట్యాలా సంస్కృత భాషా వినియోగంతో దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.