PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ మాజీ ప్రధాని పై ఐదేళ్ల నిషేధం !

1 min read

పల్లెవెలుగువెబ్ : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆ దేశ ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. విదేశీ నేతలు, ప్రతినిధుల నుంచి స్వీకరించిన ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్ముకున్నందుకు గాను ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. ఈ కాలంలో ప్రభుత్వ పదవులను చేపట్టడంపైనా నిషేధం విధించింది. ఈసీ తాజా నిర్ణయంతో జాతీయ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కూడా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ అయిన ఇమ్రాన్‌ కోల్పోయారు. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల ప్రధానాధికారి సికందర్ సుల్తాన్ రజా తెలిపారు.

About Author