అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది : చంద్రబాబు
1 min read
పల్లే వెలెగు వేబ్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని శంకుస్థాపనపై ట్వీట్ చేశారు. అమరావతే నిలుస్తుంది.. అమరావతే గెలుస్తుందన్నారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగిందని ట్విట్టర్ లో తెలిపారు. తెలుగు జాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని ఆకాంక్షించామన్నారు. పాలకుల తుగ్లక్ ఆలోచనలతో అంతా నాశనమైందన్నారు. అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన జగన్.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవన్నారు. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.