వాల్మీకుల సమస్యలపై ఏక సభ్యకమిటి పట్ల హర్షం..
1 min read– కానీ నివేదిక త్వరితగతిన వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: వాల్మీకుల సమస్య పరిస్కారం కొరకు,st పునరుద్ధరణ చేసేందుకు ఉన్న అడ్డంకులలను అధిగమించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామ్యూల్ గారిని ప్రభుత్వం నియమించడం పట్ల వాల్మీకుల విఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయపులికొండన్న,మాజీ జడ్పీటీసీ లాలూ స్వామి,రాస్త్రకార్యదర్శి పరమటూరి శేఖర్,నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మదుగోపాల్,రాష్ట్ర నాయకులు శివశంకర్,మండలనేత బాలు,పట్టణ అధ్యక్షులు ఓబులేసు,యూత్ అధ్యక్షులు పరమేష్,యూత్ ఉపాధ్యక్షులు మల్లికార్జున,కార్యదర్శి మధు,రమేష్,రవి,యువనేతలు బైరేశ్,గిరి, శివ,పట్టణనేతలు,సవారీ లక్షమయ్య, ఎర్రమద్దిలేటి తదితరులు హర్షం వ్యక్తం చేశారు,కానీ 66 సంవత్సరాల సమస్య ను కమిటీల పేరుతో కాలయాపన చెయ్యటం పట్ల ఒకింత అనుమానం వాల్మీకి జాతిలో ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం కమిటీలు వేసి,తీర్మానం చేసి కేంద్రానికి పంపి చెయ్యి దులుపుకుంది అందుకనే నమ్మకం వాల్మీకులలో కలగటం లేదు అందుకనే ప్రభుత్వం లేట్ గా స్పందించినా కమిటీకి ఇచ్చిన మూడు నెలల కాలవ్యవదిలో వాల్మీకుల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్ లో చట్టబద్దత చేయగలిగితే జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ,జగన్మోహన్ రెడ్డి ఫొటోను ప్రతి వాల్మీకి ఇంట్లో పెట్టుకుంటారు అలాకాక గతప్రభుత్వం చేసిన మోసం చేస్తే తప్పక ప్రభుత్వానికి తిప్పలు తప్పవు,ఇచ్చినమాట తప్పరని నమ్మకం కొంత ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకుంటారని ఆశిస్తున్నాం. ఈ రోజు కొన్ని సంఘాల నేతలు ముఖ్యన్గా లంబాడీ నేతలుమాట్లాడుతున్నారు 1956 కు ముందు బోయలు st లు అనే అంశం మరచిపోయినట్లు ఉన్నారు,చరిత్ర చదువుకోవాలి,మా హక్కులను అనుభవిస్తూ మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం 1976తరువాతనే లంబాడీలు st లుగా గుర్తించారు,అంతకు ముందే బోయలు st లనే విషయం మరిచి ఆందోళన చెయ్యటం దురదృష్టకరం.