NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శిథిలావస్థలో ‘ వల్లూరు తహసీల్దార్​ ’

1 min read
వల్లూరు తహసీల్దార్​ కార్యాలయం

వల్లూరు తహసీల్దార్​ కార్యాలయం

– కూలేందుకు సిద్ధంగా ఉన్న కార్యాలయ భవనం
– కనీస వసతులు లేక సిబ్బంది అవస్థలు
– కొత్త భవనం నిర్మించాలని కోరుతున్న ప్రజలు
పల్లెవెలుగు వెబ్​, కడప ప్రతినిధి:  జిల్లాలోని వల్లూరు తహసీల్దార్​ కార్యాలయ భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. 1994లో అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కమతం రామిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. దాదాపు 27 సంవత్సరాలు ఈ కార్యాలయంలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో.. పెచ్చులూడిపోతున్నాయి. గోడలు నెర్రలిచ్చాయి. ఎప్పుడు.. ఎవరి తలపై పెచ్చులు పడతాయోనని సిబ్బంది భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు.
వసతులు నిల్​…
వల్లూరు తహసీల్దార్​ కార్యాలయానికి సమస్యలు విన్నవించుకోడానికి వచ్చే ప్రజలు.. రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. టాయిలెట్లు లేకపోవడంతో సిబ్బంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టాయిలెట్లు లేకపోవడంతో కొందరు ఉద్యోగులు బయటకు వెళ్లిపోతున్నారు. కనీసం తాగేందుకు నీరు లేకపోవడంతో ప్రజలు అవస్థలు వర్ణణాతీతంగా మారింది. వేసవి కాలం కావడంతో ఎండలో వచ్చిన ప్రజలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
విన్నవించినా… ఫలితం లేదు: తహసీల్దార్​ కార్యాలయ భవనం మార్చాలని .. లేదా కొత్త భవనం నిర్మించాలని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోతోందని అక్కడి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్లు, తాగునీరు కూడా లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వల్లూరు తహసీల్దార్​ కార్యాలయానికి కొత్త భవనం నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

About Author