సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందాం..
1 min readపల్లెవెలుగు,వెబ్ నందికొట్కూరు: ఆరాధనా పద్ధతులు వేరైన భారతీయ సాంస్కృతిక పరంపరను మాత్రం ఎవ్వరూ మరువకూడదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం, నెహ్రూనగర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా సామూహిక కుంకుమార్చన మరియు గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశానికి విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించి పెట్టినది భారతదేశపు సాంస్కృతిక పరంపరనే అని గుర్తు చేశారు. మన పూర్వులు మనకందించిన అపురూపమైన భారతీయ వారసత్వ పరంపరను ఈ దేశపు పౌరులుగా దానిని కాపాడుకునుటకు అందురూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా లలితా పీఠం పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి చేసిన శ్రీమద్రామాయణ, మహాభారత, భగవద్గీతలపై ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చివరి రోజు గోపూజ, దాని విశిష్టతను గురించి చక్కగా వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూరాకుల రాజేశ్వరమ్మ తిక్కస్వామి, సి.బి.దొరస్వామి, మాజి సర్పంచ్ యం.వెంకట శివారెడ్డి, టి.కోటేశ్వర రెడ్డి, పి.గంగన్న, భీమన్నగారి అశ్విని కుమార్, టి.లక్ష్మీనారాయణ, పాలూరి శ్రీనివాసులు, కూరాకుల చిన్న వెంకటస్వామి, పెద్ద వెంకట స్వామి, పి.ఈశ్వరయ్య, భజన మండలి హార్మోనిష్టు లక్ష్మీ నాగయ్య తబలిష్టు జి.కృష్ణయ్య , లాలెన్నతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.