PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​’ కేర్​ సెంటర్లలో వినూత్న కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కోవిడ్​ కేర్​ సెంటర్లలోని రోగులకు మానసికోల్లాసం, వైరస్​ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత బృందాలతో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని కేర్​ సెంటర్లలో కళాజాత బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కోవిడ్​ బాధితులు ఉత్సాహంగా వీక్షించారు. కళాజాతల నిర్వహణ కోసం దాదాపు రూ.4.50 లక్షల బడ్జెట్ ను మంజూరు చేసి కళాకారుల గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ.2.25 లక్షల అడ్వాన్స్ ను జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు కు విడుదల చేసినట్లు కలెక్టర్​ జి. వీరపాండియన్​ తెలిపారు. దీంతో కళాజాత బృందం కేర్​ సెంటర్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


About Author