PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2023 నాటికి.. ఎంబిబిఎస్ అడ్మిషన్లు ప్రారంభించాలి

1 min read

– ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి 4O4 కోట్లతో నిధులు కేటాయింపు
– ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఉన్నత అధికారులతో క్యాంప్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం నాని సమీక్ష..
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు:ఏలూరు జిల్లా,ఏలూరు:వచ్చే ఏడాది 2023ఆగష్టు నాటికి ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బి బి ఎస్ అడ్మిషన్స్ ప్రారంభం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం.ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి 404కోట్లుతో నిధులు కేటాయింపుతో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో లక్ష చదరపు అడుగుల్లో 38కోట్లుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రెండు భవనాలు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించిన ఏపి మాజీ డిప్యూటీ సిఎం,ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.ఎన్నో సంవత్సరాల ప్రజలు కలను సహకారం చేయనున్నారని తెలిపారు,రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చి ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షను చిత్త శుద్ధితో అమలు చేస్తున్న మాజీ హెల్త్ మినిస్టర్ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కృషి చేస్తున్నారు.2023ఆగష్టు నాటికి మొదటి సంవత్సరం ఎం బి బి ఎస్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించడానికి ప్రత్యేకంగా చర్యలు చేయట్టాలని సంబందించిన అధికారులకు విజ్ఞప్తి చేసిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణపు పనులు పురోగతిపై ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో APMSIDCఉన్నతాధికారులతో మాజీ డిప్యూటీ సిఎం,ఎమ్మెల్యే ఆళ్ల నాని శనివారం సమీక్ష నిర్వహించారు,ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో 25ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీతో పాటు 24×7హాస్పిటల్ నిర్మాణం, వివిధ అనుబంధ భవనాలు నిర్మించడానికి శరవేగంగా పనులు చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని అధికారులకు సూచించారు.ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు ఆనుకొని ఉన్న 7ఎకరాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంతంలో స్టూడెంట్స్, మెడికల్ కాలేజీ సిబ్బంది, టీచింగ్, నాన్ టీచింగ్, రెసిడెన్సియల్ క్వాటర్స్ నిర్మాణానికి ప్రతి పాదనలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని విజ్ఞప్తి చేసారు.అమీనాపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటున్న 1000విద్యార్థుల వసతి గృహం కోసం ఏటిగట్టు ప్రాంతంలో 1.8 ఎకరాల స్థలంలో వసతి కోసం ప్రతి పాదనలు రూపొందించాలని ఏ.పి.ఎం. ఎస్.ఐ.డి.సి ఇంజనీరింగ్ అధికారులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.నేషనల్ మెడికల్ కౌన్సిల్ టీమ్ ఈ నవంబర్,డిసెంబర్ నెలల్లో తనిఖీ చేయనున్న దృష్ట్యా నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ భవనాలు నిర్మాణం మరింత వేగవంతం చేయాలని మాజీ హెల్త్ మినిస్టర్ ఎమ్మెల్యే ఆళ్ల నాని కోరారు.ప్రస్తుతం ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రాంగణంలో 1.8ఎకరాల స్థలంలో మొదటి సంవత్సరం బి బి ఎస్ తరగతులు నిర్వహించేలా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నానికి వివరించారు.ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న 25ఎకరాల స్థలంలో పర్మినెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాలు నిర్మించడానికి లే అవుట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని అప్రూవల్ ఇచ్చారు.మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం 30నెలల్లో భవనాలు నిర్మాణం పూర్తి చేయాలని మాజీ హెల్త్ మినిస్టర్, ఎమ్మెల్యే ఆళ్ల నాని సంబందించిన అధికారులకు అదేశాలు ఇచ్చారు.నాలుగు ఫ్లోర్లు ల్లో నూతన మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసారు.భవిష్యత్తులో అన్ని వసతులు,అత్యాధునిక ల్యాబ్ లు, తరగతి గదులు నిర్మాణం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 24గంటలు పాటు హాస్పిటల్ ఉండేలా కొత్తగా భవనాలు నిర్మాణం కూడ చేపట్టడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు.ఈ సమావేశంలో ఏ.పీ.ఎం. ఎస్.ఐ.డి.సి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు,సూపరిండెంట్ ఇంజనీర్ అంకమ్మ ఉమా శంకర్,ఇ ఇ రాజబాబు,ఏపి మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వర ప్రసాద్ రావు ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబు,ఏలూరు ఎం ఆర్ ఓ సోమశేఖర్,జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

About Author