ప్రజల సౌలభ్యం కోసం మొబైల్ ఆధార్ కేంద్రం…
1 min read– ఎంపీడీవో విజయ సింహారెడ్డి
పల్లెవెలుగు, వెబ్ గడివేముల: మండలం లోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాడు ఎంపీడీవో విజయ సింహారెడ్డి మాట్లాడుతూ, ప్రజల సౌలభ్యం కొరకు ప్రభుత్వ అధ్వరంలో మొబైల్ ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఒక్కొక్క రోజు ఒక సచివాలయం పరిధిలో ఆరు గ్రామాలలో మొబైల్ ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కొత్త ఆధార్ కార్డు, ఇదివరకే ఉన్న ఆధార్ నంబర్ కు బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్లో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబరు, మెయిల్ ఐడి, లింగము, చిరునామా తదితర మార్పులకు, ఆధార్ డౌన్లోడ్ మరియు కలర్ ప్రింట్, డాక్యుమెంట్స్ అప్డేట్ మొదలగునవి ఈ కేంద్రం ద్వారా మార్పు చేయించుకోవచ్చని మొబైల్ ఆధార్ కేంద్రాన్ని 25వ తేదీ పెసరవాయి సచివాలయం పరిధిలోని ఎంపీ యూపీ పాఠశాల యందు, 26వ తేదీ కరిమద్దెల సచివాలయం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 27వ తేదీ బూజునూరు సచివాలయం పరిధిలోని ఎంపీపీ పాఠశాల యందు, 28వ తేదీ చిందుకూరు సచివాలయం పరిధిలోని ఎంపీపీ పాఠశాల యందు, 29వ తేదీ గడిగరేవుల సచివాలయం పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు, 31వ తేదీ కొరటమద్ది సచివాలయం పరిధిలోని ఎంపీ యుపి పాఠశాల యందు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మొబైల్ కేంద్ర అందుబాటులో ఉంటుందని ఎంపీడీవో తెలిపారు, అలాగే సంబంధిత సేవలకు గాను ఫీజు వివరాలను తెలిపారు, కొత్త ఆధార్ నమోదుకు అందరికీ ఉచితంగా, బయోమెట్రిక్ అప్డేట్ కొరకు సున్నా నుంచి 15 సంవత్సరముల వయసు వారికీ ఉచితము, 15 సంవత్సరం వయసు పైబడిన వారికి ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున ఫీజు ఉంటుందని, అలాగే పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, లింగము, చిరునామా తదితర వివరాలను అప్డేట్ చేసుకొనుటకు సున్నా నుంచి 15 సంవత్సరంల వయసుు వారికి ఉచితమని, 15 సంవత్సరముల వయసు పై బదిన వారికి 50 రూపాయలు ఫీజు ఉంటుందని, ఆధార్ డౌన్లోడ్ మరియు ప్రింట్ కొరకు 30 రూపాయలు ఫీజు,డాక్యుమెంట్ అప్డేట్ కొరకు 50 రూపాయలు ఫీజు ఉంటుందని, కావున అందరూ ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోగలరని ఎంపీడీవో గారు తెలియజేశారు. ఎంఈఓ రామకృష్ణుడు మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ఆధార్ నంబర్ ఉంటుంది కానీ బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఉండరు కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని తమ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ బయోమెట్రిక్ అప్డేషన్, కొత్త ఆధార్ ఎన్రోల్ మొదలగు సేవలను ఉపయోగించుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.