స్వీట్లు, ఐస్ క్రీమ్ ఇచ్చి చంపేశారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం పై పన్నీర్ సెల్వం(ఓపీఎస్) మద్దతుదారుడు కోవై సెల్వరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలితకు ఐస్‌క్రీములు, స్వీట్లు ఇచ్చి, చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. చెన్నైలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అరుణా జగదీశన్ కమిషన్ నివేదిక, అర్ముగస్వామి కమిషన్ నివేదికలను ప్రస్తావించిన ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జయలలిత మృతికి సంబంధించి రెండు నివేదికలు బయటకు వచ్చినా ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడకపోవడం హాస్యాస్పదమన్నారు. ఎడప్పాడితోపాటు తప్పు చేసిన అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.