మద్దికెర లో భక్త కనకదాసు జయంతి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం కేంద్రంలో నవంబర్ 27 వ తారీఖున భక్త కనకదాసు జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని ఆదివారం కర్నూలు నగరంలో శ్రీ మేదా జూనియర్ కళాశాలలో కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,నగర కార్యదర్శి బి .రామకృష్ణ ,కళాశాల అధినేత కే .రాము ,మద్దికెర మండల కురువ సంఘం నాయకులు గడ్డం రామాంజనేయులు ,ఈ కార్యక్రమంలో మద్దికెర కురువ యువజన సంఘం నాయకులూ శివప్రసాద్ ,.నరసింహులు ,ఉదయ్‌కుమార్ ,పక్కీరప్ప ,శంకర్ ,రామాంజనేయులు ,కే .వెంకటేష్ లు కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువల ఆరాధ్య దైవం భక్త కనక దాసు జయంతి ఉత్సవాలు ప్రతి మండలంలో అంగరంగవైభవంగా జరుపుకొవాలని వారు పిలుపునిచ్చారు .అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కనకదాసు జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు .మద్దికెర గ్రామంలో జరిగే భక్త కనకదాసు జయంతి ఉత్సవాలకు జిల్లావ్యాప్తంగా కురువ కులస్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.