యాడ్ ఆదాయం విరాళంగా ఇవ్వనున్న బాలయ్య !
1 min readపల్లెవెలుగువెబ్ : రియలెస్టేట్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో నందమూరి బాలకృష్ణ కనపించబోతున్నారు. ఇప్పటికే ఈ యాడ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం. ఈ యాడ్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను ఆయన బసవతారం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఆయన గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. మరోవైపు ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు.