PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిర్యానీ లైంగిక పటుత్వాన్ని దెబ్బతీస్తుందా ?

1 min read

పల్లెవెలుగువెబ్: బిర్యానీ తయారీకి ఉపయోగించే కొన్ని దినుసులు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు టీఎంసీ నేత రవీంద్రనాథ్ ఘోష్ ఆరోపించారు. ఇదే ఆరోపణతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో రెండు బిర్యానీ దుకాణాలను మూసివేయించారు. ఆయన గతంలో మమత బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. రవీంద్రనాథ్ ఘోష్ ప్రస్తుతం కూచ్ బిహార్ పురపాలక సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిర్యానీ తయారీకి ఉపయోగించే మసాలా దినుసులు, రకరకాల పదార్థాలు, గింజలు పురుషుల్లో లైంగిక కోరికలను తగ్గిస్తున్నట్లు చాలా మంది ఆరోపిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలోని చాలా మంది కొన్ని రోజుల నుంచి దీనిపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. పురుషుల్లో లైంగిక కోరికలను నిరోధించే పదార్థాలు ఏం వాడుతున్నారో అర్థం కావడం లేదని వారు చెప్తున్నారని తెలిపారు.

About Author