ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్నూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికుల కూస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురామమూర్తి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రమేష్ బాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆటో కార్మికుల సమస్యలపరిష్కారం కోసం స్థానిక నందికొట్కూర్ పట్టణంలో కేజీ రోడ్డుపైఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కాటేపోగు నాగేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లను మరమ్మత్తులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో రంగాన్ని పరిశ్రమంగా గుర్తించాలని వారు అన్నారు జాతీయ బ్యాంకుల ద్వారా కొత్త ఆటోలు కొనుగోలుకు డ్రైవర్స్ కు పావలా వడ్డీకి లోన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని అలాగే ఆటోలపై పెంచిన గ్రీన్ టాక్స్ ను తగ్గించాలన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లపై ఆర్టీసీ ,రవాణా, పోలీస్ అధికారులు పెడుతున్న అక్రమ కేసులు మరియు అధిక జరమానాలను అరికట్టాలని హెచ్చరించారు ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా రూ, 20 లక్షల ఎక్స్గ్రేషియా మరియు సహజమరణం భీమా కింద ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలన్నారు అర్హత ఉన్న వారికి ఇంటి స్థలం మంజూరు చేసి పక్క గృహాలు మంజూరు చేయాలన్నారు 55 సంవత్సరాలు దాటిన డ్రైవర్ల కు ప్రభుత్వం నెలకు రూ, 5000 రూపాయలు సామాజిక పెన్షన్ మంజూరు చేయాలన్నారు పెంచిన పెట్రోల్ ,డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు తదితర డిమాండ్ల సాధన కోసం ఏపీ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం చేయని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లను సమైక్యపరిచి అసెంబ్లీ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు తామస్ రాజేష్ నాగరాజు శేషన్న రెహమాన్ షేక్షావలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.