ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన కస్తూర్భా బాలికలు
1 min read– నెట్ బాల్ జిల్లాస్థాయిలో మొదటి స్థానం,రాష్ట్ర పోటీల్లో నలుగురు బాలికలు ఎంపిక
పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: జిల్లా స్థాయిలో జరిగిన ఆటల పోటీలలో మిడుతూరు కస్తూర్బా గాంధీ విద్యాలయ బాలికలు ఉన్నత ప్రతిభ కనబరిచారు.ఈనెల 22న కర్నూలులో జరిగిన నెట్ బాల్ ఆటల పోటీలలో మిడుతూరు కేజీబీవీ బాలికలు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు.ఈపోటీలో తొమ్మిది జట్లు పాల్గొన్నాయని ఈపోటీలో ఆడిన 10 మంది విద్యార్థులు అశ్విని,స్వప్న,ఈశ్వరి,కీర్తి,శ్రీవిద్య,సురేఖ, నందిని,మౌనిక,మంజుల,కళ్యాణి వీరు ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచారని అదేవిధంగా వీరిలో రాష్ట్రస్థాయి పోటీలకు సీనియర్స్ యుగందేశ్వరి,కీర్తి ఎంపికయ్యారని కేజీబీవీ ఎస్ఓ ఉమా గైర్వాణీ,పిఈటి సుమలత అన్నారు.జూనియర్స్ లో నందిని,శ్రీవిద్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.అదేవిధంగా ఈనెల 22,23న ప్రకాశం జిల్లాలో అర్ధవీడులో జరిగిన రగ్బీ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలలో జె.రాణి,రుక్సానా మొదటి స్థానంలో నిలిచారు. గెలుపొందిన బాలికలకు అధికారులు మెడల్స్ మరియు సర్టిఫికెట్లను అందజేశారు.ఈఆటల పోటీలలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచినందుకు గాను విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎస్ఓ ఉమా గైర్వాణి,పిఈటి సుమలతను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.