పోలీసు చట్టాలపై విద్యార్థులకు అవగాహన
1 min read– ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య.
పల్లెవెలుగు ,వెబ్ గడివేముల: ఆయుధ ప్రదర్శన పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై బీటి వెంకటసుబ్బయ్య రాజరిక పాలన రద్దయిన తర్వాత 150 ఏళ్ల క్రితం ప్రత్యేక చట్టాల ద్వారా పోలీస్ వ్యవస్థ ఏర్పడినట్లు బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. నేరం జరిగిన సమయంలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు ఆయుధాల వాడకం ఆత్మరక్షణ తదితర అంశాలపై పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం నాడు ఎస్సై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు.