డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ కు ఉద్యోగాలు కల్పించాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ విజయవాడ:1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని క్వాలిఫైడ్ టీచర్స్ సభ్యులు బైరవకోన శ్రీనివాసరావు అన్నారు. వయోపరిమతి దృష్ట్యా ముందుగానే ఉద్యోగ అపాయింట్మెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ని కోరారు.ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 23ఏళ్లుగా 1998 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ పోరాడుతున్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ గుర్తించి జులై 16న మా ఫైల్ పై సంతకము చేసి ఉద్యోగాలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ నిమిత్తం సర్టిఫికెట్ వెరిఫికేషన్లు కూడా జరిగాయని వెల్లడించారు. కానీ ఉద్యోగాలు వచ్చే ముందు మాలో కొంతమందికి 6నెలల సంవత్సరంలోనే వయోపరిమితి పూర్తవుతుందని కావున దయవుంచి రెగ్యులర్ టీచర్స్ బాధితులకు, మాకు సంబంధం లేకుండా వయోపరిమిత దృష్టిలో ఉంచుకొని మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వవల్సినదిగా మీడియా ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.సమావేశంలో ఆర్.మేరీ, కె.నాన్సీ సుసాన్, కె.సుమన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.