డవ్ షాంపూ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ కంపెనీ యూనిలీవర్‌కు చెందిన పలు షాంపూ బ్రాండ్‌లలో క్యాన్సర్‌ను కలిగించే రసాయనం కనుగొనబడింది. యూఎస్ మార్కెట్ నుండి డవ్, నెక్సస్, ట్రెస్మె, టిగీ, సువావే, ఏరోసోల్ వంటి డ్రై షాంపూలను రీకాల్ చేసింది. వాటిలో క్యాన్సర్ కారకమైన బెంజీన్ ఉందని హిందుస్తాన్ యూనిలీవర్ గుర్తించింది. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని పేర్కొంది. ఏరోసోల్ డ్రై షాంపూ ప్రొడక్టులు ప్రమాదకరమని.. వీటిని అస్సలు వాడొద్దని వినియోగదారులను హెచ్చరించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ఈ ఉత్పత్తులు అక్టోబర్ 2021కి ముందు తయారు చేయబడిన వాటిలో ఈ హానికారకమైన కారకాలు ఉన్నట్లు ఎఫ్డీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ రిటైలర్‌లకు ఈ విషయాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. వీటిని వాడే కస్టమర్లు వెంటనే ఆపేయాలని ఎఫ్‌డీఏ పేర్కొంది. వీటిని కొనుగోలు చేసిన వారు.. రియంబర్స్ మెంట్ కు UnileverRecall.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎఫ్డీఏ చెబుతోంది.