హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి !
1 min read
పల్లెవెలుగువెబ్ : హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న జరగనున్న బీజాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోంది.