భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 27వ తేది ఆదివారం ఉదయం 9 గంటల నుండి కర్నూలు నగరం సి.క్యాంపులోని తి.తి.దే. కళ్యాణ మంటపం నందు భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞానకర్మసన్యాసయోగము లోని మొత్తం42 శ్లోకాలపై 6, 7 తరగతుల విద్యార్థులకు ఒక విభాగంగా, 8 .9 తరగతుల విద్యార్థులకు మరో విభాగంగా నిర్వహించబడును.సంపూర్ణ భగవద్గీత కంఠస్థ పఠన పోటీలుఅలాగే 18 సంవత్సరాల వయసు లోపు వారికి ఒక విభాగంగా, 18 సంవత్సరాలు పైబడిన వారికి ఒక విభాగంగా సంపూర్ణ భగవద్గీత (18అధ్యాయాలు) కంఠస్థ పఠన పోటీలు నిర్వహించి, అన్ని విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారికి విలువైన బహుమతులు ప్రధానం చేయబడు తుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన అన్ని విభాగాలవారిని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అన్ని జిల్లాల నుండి వచ్చిన వారందరికీ కలిపి పోటీలు నిర్వహించి, ఈ పోటీలలోని విజేతలను తితిదే అధికారులు సత్కరించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు, పాఠశాలల యాజమాన్యం ప్రోత్సహించగలరని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు 9059802265 / 9441008677 ఈ చరవాణిలో సంప్రదించగలరు.