30న రౌండ్ టేబుల్ సమావేశం
1 min readపల్లెవెలుగు,వెబ్ కర్నూలు: శ్రీ బాగ్ ఒప్పందం అమలు, న్యాయ రాజధాని ( హైకోర్ట్), నీళ్లు నిధులు నియామకాల్లో రాయలసీమ వాటా సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాయలసీమ జెఎసి నేతలు కోనేటి వెంకటేశ్వర్లు, కటరుకొండ సాయి కుమార్, కురువ బాలరాజు తెలిపారు. స్థానిక కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ గారిని, ఉర్దూ యూనివర్సిటి రిజిస్టర్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు గారిని కలిసి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, న్యాయ డిమాండ్ల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు రాయలసీమ ఉద్యమకారులు ఏకమై పోరాడాలన్నారు. కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బిఎయస్ కళ్యాణ మంటపంలో 30వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10:00 గంటలకు నుండి 2:00 గంటల వరకు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసీమ 8 జిల్లాలో ఉన్న మేధావులు, న్యాయ వాదులు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి, ప్రజా, కుల, సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి మన ప్రాంత హక్కులు సాధించుకునే దిశగా కృషి చేద్దామన్నారు.