అణు గీత దాటొద్దు.. రష్యాకు హితవు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ తమపై దాడి కోసం ‘డర్టీ బాంబ్’ సిద్ధం చేస్తోందని షొయిగు చెప్పగా, అందుకు రాజ్ నాథ్ స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని షొయిగుకు సూచించారు. భారత్ కోరుకుంటున్నది ఇదేనని ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా, ఉక్రెయిన్ అణ్వస్త్ర ప్రయోగానికి దిగరాదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి అణుయుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పేర్కొన్నారు.