PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడల్ స్కూల్ కేజీబీవీకి రహదారి వేయండి..

1 min read

– ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన విద్యార్థి సంఘాలు
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం: మండలంలో ఏ పీ మోడల్ స్కూల్ కేజీబీవీ స్కూల్ లకు రహదారి వేయాలని బుధవారం నాడు రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సభ్యులు, బత్తిని ప్రతాప్, KJ శ్రీనివాసరావు బుధవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్భూపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు మండల కేంద్రంలో Ap మోడల్ స్కూల్, కళాశాల, KGBV స్కూల్, కళాశాల లకు దారి లేనందున గత ఆరు సంవత్సరాల నుండి స్కూల్ కు రహదారి వేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్ డిమాండ్ చేశారు సరైన రహదారి లేక విద్యార్థులు ప్రతిరోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని దాదాపు 3000 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలకు వెళ్లాలంటే గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు కావున వెంటనే రహదారి ఏర్పాటు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అదేవిధంగా స్కూల్ కు వంటగది లేక బయట వంటలు చేసే పరిస్థితి వస్తున్నది.అలాగే కళాశాలలో సైన్స్ ల్యాబ్ లో సరైన పరికరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ,సాయంకాలం సమయంలో అక్కడబాలికల హాస్టల్ ఉన్నది దానికి ఎటువంటి భద్రత లేకపోవడంతో విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారని అధికారులు స్పందించి రోజు ఒక కానిస్టేబుల్ ని సాయంత్రం, రాత్రి సమయాలలో ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

About Author