దేశానికి ఊపిరి కావాలి: రాహుల్‌గాంధీ
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన విజృంభిస్తున్న వేళ ఈ దేశానికి ఊపిరి కావాలని, ప్రధాని నివాస భవనం సెంట్రల్ విస్టా కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశంలో కరోన బాధితులు ఆక్సిజన్ అందక అల్లాడుతుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా పనులు కొనసాగించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. దేశం ఆరోగ్యం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను అత్యవసర పనుల కింద తీసుకురావడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పడుతున్నారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నారు.