బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి వినతి
1 min read– బీసీల కుల జనగణన మరియు వాల్మీకి కులస్తులకు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ తక్షణమే చేపట్టాలి
పల్లెవెలుగు, వెబ్ అనంతపురం : అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రాచర్ల వాల్మీకి లాయర్ హరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారికి వినతిపత్రం అందజేసి కోరడమైనది . అనంతపురం పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోమువీర్రాజు గారిని కలిసి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీల యొక్క కులగణన మరియు వాల్మీకుల యొక్క చిరకాల అయినటువంటి వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ వెంటనే చేపట్టేలా సహకరించాలని వినతి పత్రం ద్వారా తెలియజేయడమైనది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాల్మీకి లాయర్ హరి మాట్లాడుతూ గత దశాబ్దాలకాలంనుంచి బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధి విధానాలు వల్ల SC, ST, BC, మైనారిటీలు అన్ని విదాలుగా నష్టపోతున్నారు కనుక రాజ్యాంగ బద్దంగా ఫలాలు అందరికీ అందాలంటే కుల గణన జరగాలి అందుకే బిల్లును వెంటనే చేపట్టాలని , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోయలు 1956 కి ముందు రాష్ట్రము మొత్తం ST లుగా ఉన్నారు , ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కుయుక్తులతో , భారత రాజ్యాంగ రూల్సుకు వ్యతిరేకంగా , రూల్స్ పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మైదాన ప్రాంత వాల్మీకులను బీసీలుగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాల్మీకులను ఎస్టీలుగా ఒకే రాష్ట్రంలో రెండు రిజర్వేషన్ లు అవలంబిస్తు విడదీయడమైనది , అప్పటి నుంచి నేటివరకూ ఆంధ్రప్రదేశ్ లోని బిసి – ఏ లో ఉన్నటువంటి బోయలు విద్యా , ఉద్యోగ , ఆర్థిక , రాజకీయ , ఉద్యోగాలలో ప్రమోషన్ , సామాజికంగా ఇలా అన్ని రకాలుగా నష్టపోవడమైనది అని ప్రస్తుతము జరుగుతున్న పరిస్తితి , పరిపాలనను తప్పుపడుతూ తక్షణమే వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్ ను పునరుద్ధరణ చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని బీసీ ప్రధానమంత్రి అయుండి కూడా బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క విద్య ఉద్యోగ , ఉపాధి అవకాశాలను కల్పించుట లో బిజెపి ప్రభుత్వం విఫలమైందని తద్వారా బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క ఆర్థిక సామాజిక ఎదుగుదలను అడ్డుకోవడం జరుగుతోందని కనుక వెంటనే ఈ సమస్యలపై దృష్టి పెట్టాలనీ తెలియజేశారు . ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ,బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంజి , నాగరాజు సాయిరాజ్, తదితరులు పాల్గొన్నారు .