కమిషనర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆటో కార్మికుల, చిన్న వ్యాపారస్తుల పొట్ట కొడుతున్న, కమిషనర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ఆఫీస్, ముట్టడి రోడ్డు సైడ్ చిన్న వ్యాపారస్తుల ఆటో కార్మికులపై మున్సిపల్ కమిషనర్ తన వైఖరికి నిరసనగా మునిసిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమానికి ఆటోయూనియన్ ప్రధాన కార్యదర్శి మహీముధ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లాఉపధ్యక్షు రాలు శ్రీమతి పి నిర్మలమ్మ హాజరై ప్రసంగించారు. కర్నూలు నగరంలో విచిత్రంగా ఉన్న కమిష్ణర్ విధానాన్ని ఎండగట్టరు. ఆటో కార్మికుల చిన్న వ్యాపారస్తుల, జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మన్నాలను పొందాల్సిన నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం చాలా బాధాకరమని ,ఆమె వాపోయారు. తక్షణమే ఆటో కార్మికుల అడ్డాలను అదేవిధంగా చిన్న వ్యాపారస్తుల షాపులను వారి జోలికి పోకూడదని ఆమె కోరారు అనంతరం సిఐటియు నగరం ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లు ఆఫీస్ ఖాన్, కాటసాని, సుధాకర్ గార్లు వున్నా రే వారికీ బాధ్యత లేదా అని అయన ప్రశ్నించారు. తక్షణమే స్పందించి ఆటో కార్మికుల చిన్న వ్యాపారస్తుల సమస్యలపై కమిషనర్ తో, ట్రాఫిక్ పోలీస్ తో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నగరంలో ఉన్న అన్ని కార్మికులను సమీకరించి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ దేశాయి, విజయ్ లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో అధికారులు పాలక పక్షాలు కలిసి పేద, బడుగు , బలహీనవర్గాల వారు ఎవరు ఉండకూడదని, కంకణ బద్ధులై ఉన్నట్టు కనిపిస్తావుందని, ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నగరపాలక సంస్థ మేయర్ ,కమిషనర్ ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే తగిన గుణపాఠం చెప్తామని, వారు హెచ్చరించారు. రోడ్ సైడ్ చిన్నయపరస్తుల సంఘం అధ్యక్షుడు ముహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ కమిషనర్ మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. కమిషనర్ ఒక అధికారి కాకుండా ఒక చదువురాని సన్యాసిలా మాట్లాడుతున్నాడని, ఒక చిన్న జండా తొలగించడం కోసం ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి పోవడం అనేది ఐఏఎస్ అధికార సిగ్గుచేటు అని ఆయన చెప్పారు. నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏ అధికారైన వారి అభివృధ్ధి కోసం వారికి ప్రభుత్వం ద్వారా రావలసిన లోన్లను ఆ రకంగా సహకరించాల్సింది పోయి, వారి పట్ల ఒక శత్రువుగా చూడడం భావ్యం కాదని ,ఆయన తెలియజేశారు. అనంతరం చిన్న వ్యాపారస్తుల సంఘం సంఘం నగర కార్యదర్శి మహమ్మద్ రఫీ మాట్లాడారు .ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు రాముడు, కుమార్, వెంకటస్వామి, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు జి నరసింహులు ,ఎగ్బాల్, గౌస్, శివప్రసాద్, విజయ్, ఇలియాస్, రజనీకాంత్ రెడ్డి,శ్రీను,నీలమ్మ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.