‘కర్ఫ్యూ’లో బయటకు రావాలంటే.. ‘ ఈపాస్’
1 min readఎస్పీ, కమిషనర్ల అనుమతి తప్పనిసరి
– ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత
పల్లెవెలుగు వెబ్: కర్ఫ్యూ సమయంలో అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా ఈపాస్ తీసుకోవాలని, ఏ అవసరం మీద వెళ్తున్నారో చెప్పి ఎస్పీ, కమిషనర్లతో అనుమతి పొందాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ నిబంధన సోమవారం నుంచి వర్తిస్తుందన్నారు. కొత్త నిబంధనలు వచ్చేంత వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్న ఆయన… అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అవసరమైతే తప్పా బయటకు రావొద్దని, మాస్క్ ధరించి, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఫిర్యాదు చేయాలనుకున్న వారు నేరుగా పోలీస్ స్టేషన్కు రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యం వినియోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాలకు అనుమతి లేదు.