విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
1 min read– పి డి ఎస్ యు నంద్యాల డివిజన్ ఉపాధ్యక్షులు సతీష్
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నంద్యాల డివిజన్ ఉపాధ్యక్షులు సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను జగన్ సర్కారు నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పట్టించుకోని పరిస్థితి లో జగన్ ప్రభుత్వం ఉందని విమర్శించారు 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయొద్దన్నారు.రాష్ట్రంలో సుమారు 5,250 ప్రాధమిక పాఠశాలలను విలీనం చేశారన్నారు.దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ముఖ్యంగా బాలికలు బడిబాటకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలీనాన్ని ఆపి జీవోలు 84,85,117,128 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలు ప్రారంభమై సుమారు మూడు నెలలు గడుస్తున్నగానీ 47 లక్షల మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య,నోట్ పుస్తకాలు,విద్యాకానుక కిట్లు,ఏకరూప దుస్తులు అందించలేదని దుయ్యబట్టారు.అలాగే సంక్షేమ వసతి గృహ విద్యార్థుల మెస్,కాస్మోటిక్ ఛార్జీలు పెంచకపోవడం ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు అద్దం పడుతున్నదన్నారు.పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు.విద్యా, దీవెన,వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు.జీవో 77 వల్ల పీజీ విద్యార్థులు విద్యా దీవెన,వసతి దీవెన పథకాలకు గత మూడు సంవత్సరాల నుండి దూరమవుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సుబ్బారెడ్డి రాజు ప్రతాప్ తదిరులు పాల్గొన్నారు.