భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజం అందిద్దాం..
1 min read– స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుదాం…నగర్ కమిషనర్ షేక్ షాహిద్
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : రాబోవు భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ షేక్ షాహిద్ తెలిపారు.ప్లాస్టిక్ రహిత నగరం,ఆరోగ్యకర జీవనం పై కమిషనర్ ఛాంబర్ లో గురువారం నగరంలోని వివిధ కళాశాల,పాఠశాల యాజమాన్యాలతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్,ప్లాస్టిక్ రహిత నగరంగా ఏలూరు నగరాన్ని తీర్చిదిద్దుదామన్నారు.ప్లాస్టిక్ వ్యర్ధాల నిషేధం,ఆరోగ్యకర జీవన విధానంపై విద్యార్థి దశ నుంచే పిల్లలకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగంపై పిల్లలకు తెలియజేయాలన్నారు.ఒక్కసారి వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్ధాలు,వాటి వలన కలిగే అనర్ధాలపై వారంలో ఒకరోజు విద్యార్థినీ,విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాలలు,కళాశాల యాజమాన్యాలకు కమిషనర్ సూచించారు.ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చేందుకు నిషేధిత ప్లాస్టిక్ పై గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పలు అవగాహన కార్యక్రమాలు, నిర్వహించామన్నారు.నగర పరిధిలో మిషన్ కృష్ణ,గోదావరి కెనాల్,కెనాల్ బండ్ అభివృద్ధి పనులు చేపట్టామని కమిషనర్ షాహిద్ పేర్కొన్నారు. అనంతరం పాఠశాలలు, కళాశాల ప్రతినిధులతో కలసి కమిషనర్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మనోహరి,నగరంలోని సర్ సి.ఆర్.ఆర్ విద్యాసంస్థలకు చెందిన పాఠశాల ఉపాధ్యాయులు,కళాశాలల ప్రిన్సిపల్స్,సెంట్ తెరిసా మహిళా కళాశాల,ఆదిత్య డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్,శర్వాణి పబ్లిక్ స్కూల్,సుబ్బమ్మ దేవి మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.