PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏజెన్సీకి ఒక న్యాయం ..ఔట్సోర్సింగ్ కు మరో న్యాయం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మహానంది : ఏజెన్సీ సిబ్బందికి ఒక న్యాయం ….ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఒక న్యాయం జరుగుతుందని ఆరోపణలు వినవస్తున్నాయి .వివరాల్లోకి వెళితే మహానంది దేవస్థానంలో పనిచేసే ఏజెన్సీ సిబ్బందికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రోజుకు పెరిగిన జీతం 14 రూపాయలు .దీంతోపాటు అదే దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి రోజుకు వంద రూపాయల జీతం పెంచుతూ దేశాలు జారీ అయ్యాయి .దీంతో కంగు తిన్న ఏజెన్సీ సిబ్బంది పెరిగిన జీతం మాకు వద్దు ..పాత జీతమే ముద్దు ..అంటూ పాత జీతం వైపే ముగ్గు చూపిస్తున్నట్లు సమాచారం .ఏజెన్సీ సిబ్బందికి పెరిగిన జీతం ప్రకారం పదివేల 344 రూపాయలు కాగా ఔట్సోర్సింగ్ సిబ్బందికి పాత జీతం ప్రకారం 12 వేల రూపాయలు ఉండగా కొత్త జీత ప్రకారం 15000 రూపాయలుగా పెంచుతూ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు .అందరూ సమానంగా ఉద్యోగం బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తేడా ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు .కనీసం ఒకటి తాగితే పది రూపాయలు అవుతుంది అని కేవలం 14 రూపాయలు పెంచడంలో అంతర్యం ఏమిటని ఇందులో ఏదో మతలబు ఉందని ఆరోపణలు వస్తున్నాయి .ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో సమయానికి మించి విధులు నిర్వహిస్తే ఓడి పేరుతో కొంత మొత్తాన్ని చెల్లించాలని లేబర్ యాక్ట్ చెప్తున్నా ఇక్కడ వర్తించడం లేదని విమర్శలు వినవస్తున్నాయి .మేము చేసే విధులు ఉన్నతాధికారుల దృష్టికి చేరితే మా పరిస్థితి ఏంటో వారికి అర్థమవుతుందని పలువురు పేర్కొంటున్నారు .ఇంతకు ఉన్నతాధికారులు కేవలం రోజుకు 14 రూపాయలు మాత్రమే పెంచడం వివాదాస్పదంగా మారింది .పెంచకున్నా పర్వాలేదు కానీ పెంచిన జీతం అపహస్యం పాలు కావడం పలు విమర్శలకు తావిస్తోంది .ఏజెన్సీ సిబ్బందికి జీతం పెరగకుండా ఓ అధికారి అడ్డుపడ్డాడని విమర్శలు వస్తున్నాయి .ఔట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి జీతం పెరుగుదల విషయంలో ఓకే జీవోను ఉన్నతాధికాలకు చేరవేశారని ఏజెన్సీ సిబ్బందికి సంబంధించిన జీతాలు పెరుగుదలలో మూడు జీవోలను అధికారులకు అందజేయడంతో తక్కువగా ఉన్న జీతాన్ని పెంచుతూ అధికారులు ఆదేశాలు ఇచ్చారని ఆరోపణలు వెళ్లి వెతుతున్నాయి .దీనిపై దేవస్థానం అధికారులు తీసుకునే చర్యలతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకొని పోనున్నట్లు విశ్వాసమే సమాచారం.

About Author