ఐరాస అధికార భాషగా హిందీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఐక్యరాజ్యసమితి అధికారభాషల్లో హిందీ కూడా చేరనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ భాషలు ఐక్యరాజ్యసమితి అధికారభాషలుగా ఉన్నాయి. త్వరలో హిందీని కూడా అధికారభాషగా చేసేందుకు భారత్ యత్నాలు ముమ్మరం చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధానకేంద్రంలో హిందీ వాడుకపై ఇప్పటికే ఎంఓయూ ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని యునెస్కోకు సంబంధించి ఇప్పటికే హిందీని సోషల్ మీడియాలోనూ, న్యూస్ లెటర్లలోనూ వాడుతున్నామని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించి కూడా త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.