బాలుర వసతి గృహము తనిఖీ…
1 min readపల్లెవెలుగు , వెబ్ చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మార్తోమా విద్యా నికేతన్ బాలుర వసతి గృహమును శుక్రవారము బాలల సంరక్షణ నంద్యాల జిల్లా అధికారి శారదా ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా వసతి గృహంలోని పరిసరాల పరిశుభ్రత తో పాటు బాలుర పడక గదులు, మరుగు దొడ్లు, బాలుర ఆరోగ్య పరిస్థితులను, రికార్డులను పరిశీలించారు. మెనూ ప్రకారము అందించే ఆహార వివరాలను వసతి గృహ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అంతరము ఆమె విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం రిజిస్టర్ అయిన బాలల సంరక్షణ సంస్థలను అధికారులు, జిల్లా కలెక్టర్ సిఫారస్సు చేసిన స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తనిఖీ చేసి నివేదికలను కలెక్టర్ కు నివేదిస్తామన్నారు.జిల్లాలో 13 బాలల సంరక్షణ సంస్థలు ఉన్నాయన్నారు. ఆళ్లగడ్డ, నరసాపురము, ఎర్రగుంట్ల, చాగలమర్రి, సి, సి, ఐ లను పరిశీలించడము జరిగిందన్నారు. చాగలమర్రి లో మార్తోమా విద్యానికేతన్ వసతి గృహము అన్నివసతులతో పాటు బాలుర ఆరోగ్యము, పర్యావరణము పై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికార తనిఖీ బృందములో కడప ప్రభుత్వ బాలల సంరక్షణ వసతి గృహము కేస్ వర్కర్ మోహనబాబు, నంద్యాల మదర్ సొసైటీ స్వచ్చంద సేవాసంస్థ సి. ఈ. ఓ. రామారావు, ఆళ్లగడ్డ ఐ. సి. డి. యస్ ప్రాజెక్ట్ సి. డి. పీ. ఓ. తేజేశ్వరి,అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, హసీనా, మార్తొమ మిషన్ హాస్టల్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు.