మహానందిలో మద్యం షాపు తరలింపుకు ఏర్పాట్లు
1 min readపల్లెవెలుగు, వెబ్ మహానంది : మహానందిలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం షాపును తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి .కొందరు గ్రామస్తులతో పాటు ఆలయ అధికారులు కూడా పద్యం షాపును ఇతర ప్రాంతానికి తరలించాలని జిల్లా కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది .ఈ మేరకు స్పందించిన అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం నుంచి నంద్యాల మహానంది రోడ్డు లోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు భవనంలోకి మార్చడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది .సంబంధిత యజమానితో అగ్రిమెంట్ కూడా పూర్తయినట్లు సమాచారం .నవంబర్ ఒకటవ తేదీ నుంచి అక్కడ మద్యం దుకాణాన్ని జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది .దీనిపై కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం .పంట పొలాల్లో మద్యం సేవించి ఖాళీ బాటిల్లను అక్కడే వదిలేసి పోతే ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం .అక్కడ కాకుండా ఇతర చోటికి తరలించాలని పలువురు రైతులు కోరుతున్నారు .దేవస్థానం అధికారులు కూడా ఇతర గ్రామానికి తరలించాలని ఫిర్యాదు చేసిన మహానంది లో ఒక చోట నుండి మరోచోటికి తరలించడంపై పెద్దగా ఉపయోగం లేదని ఉన్నత అధికారుల ఆదేశాలు శిరోధార్యంగా భావించి మిన్న కున్నట్లు సమాచారం .