సేల్స్ టాక్స్ అధికారుల రాక..!
1 min read– చడీ చప్పుడు కాకుండా దుకాణాల మూసివేత
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: సేల్స్ అధికారుల రాకతో వ్యాపారులు చడీ చప్పుడు కాకుండా దుకాణాలు మూసివేశారు. మండల కేంద్రమైన రుద్రవరం గ్రామానికి శుక్రవారం సాయంత్రం సేల్స్ టాక్స్ అధికారులు దుకాణాలను తనిఖీ చేసేందుకు వచ్చారు. గ్రామంలోని ఓ దుకాణం వద్ద కారు నిలిపి దుకాణాన్ని తనిఖీ చేసేందుకు విజిలెన్స్ అధికారులు వెళ్లారు. విజిలెన్స్ అధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న వ్యాపారులు హోల్సేల్ దుకాణాలు జనరల్ స్టోర్లు నిత్యవసరాల సరుకుల దుకాణాలు మెడికల్ స్టోర్లు చడి చప్పుడు కాకుండా మూసివేశారు. ఒకే ఒక దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులు గ్రామం నుండి వెళ్లిపోయినా తిరిగి మళ్లీ వస్తారో ఏమో అన్న భయంతో దుకాణాలను తెరవకుండా వ్యాపారులు మెయిన్ బజార్లో నిలబడి ఇలాంటి అధికారులు వెళ్లారా లేక తిరిగి మల్లి వస్తారా అని చర్చించుకుంటున్నారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులకు నిత్యవసరాల సరుకులతో పాటు మెడికల్ స్టోర్లలో మందులు ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తే తనిఖీ అధికారులు ఎవరూ వచ్చినా దుకాణాలు మూసే అవకాశం ఉండదని వ్యాపారులు ఇష్టానుసారంగా వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుండడంతోనే టాక్స్ వేస్తారన్న భయంతో దుకాణాలను మూసివేస్తున్నారని వినియోదారులు ఆరోపిస్తున్నారు. చెడి చెప్పుడు లేకుండా తనిఖీ అధికారులు దుకాణాలపై దాడులు చేస్తే వినియోగదారులకు సరసమైన ధరలకే నిత్యవసరాల సరుకులు మందులు తదితరవాటిని కొనుగోలు చేసేందుకు వీలుంటుందని వినియోగదారులు కోరుతున్నారు.