PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హక్కులు అడుక్కుంటే రావు.. పోరాటమే మార్గం..

1 min read

– కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు
పల్లెవెలుగు, వెబ్​ గొనేగండ్ల: తరాలు మారి టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా నేటికీ పెత్తందారుల దాష్టికాలు దళిత, గిరిజనులపై తగ్గడం లేదని, గుప్పెడు మంది పెత్తందారుల వారసత్వ అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక గోనేగండ్ల మండల కేంద్రం లోని యం పి పి హల్ లో కెవిపియస్ మరియు దాని అనుబంధ సంఘాల మండల విస్తృత స్థాయి సమావేశం కెవిపియస్ మండల కార్యదర్శి బి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దెశించి కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకు దళితుల హక్కులు హరించబడుతున్నాయన్నారు. అనగారిన వారికోసమే మా ప్రభుత్వాలు అంటూ కోతలు కోస్తున్న పాలకవర్గాలు, ఉన్న సంక్షేమ పథకాలకు సహితం తూట్లు పొడుస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కార్పొరేషన్ లకు రూపాయ కేటాయించకుండా, మాటలతో మభ్యపెడుతూ వస్తున్నారన్నారు. హక్కులు అడుక్కుంటే రావని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలన్నారు. అనచబడ్డ వాళ్లనంతా ఐక్యం చేసి నవంబర్ 28న కెవిపియస్ రాష్ట్ర మహాసభల సందర్బంగా వేలాదిమందితో ప్రదర్శన నిర్వహించి మన శక్తేంటో చూపాలని ఆయన పిలుపునిచ్చారు.కెవిపియస్, ఎపిడికెయస్, కెజిబియస్ మండల కమిటీల ఎన్నిక…సమావేశం అనంతరం కెవిపియస్ మరియు అనుబంధ సంఘాల మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కెవిపియస్ నూతన మండల అధ్యక్షులుగా గంజహాల్లి మాధన్న, నూతన ప్రధాన కార్యదర్శిగా కులుమాల తాయప్పను ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు గా తిరిగి మారేసు ను ఎన్నుకోగా నూతన కార్యదర్శి గా గాజులదిన్నె పెద్ద కర్రెన్న ను ఎన్నుకున్నారు. కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం మండల అధ్యక్షులు గా ఎర్రబాడు జయరాజు, కార్యదర్శి గా అగ్రహారం గోపాల్ ను ఎన్నుకున్నారు. కార్యక్రమం లో యం పి టి సి తాయప్ప, బాబు, దేవదాసు, నగేష్, లక్ష్మన్న, నాగరాజు, చిన్న దేవన్న, ఏలీయా, అదాము తదితరులు పాల్గొని మాట్లాడారు. మరో 130 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author