పిల్లల సంరక్షణ.. మా బాధ్యత
1 min read– కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా…
– ‘కృష్ణా జిల్లా చెల్డెలైన్ ఆధ్వర్యంలో సంరక్షణ’
- వాల్పోస్టర్లు విడుదల చేసిన కలెక్టర్ పి.యండి. ఇంతియాజ్
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: కోవిడ్–19 బారిన పడిన తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా.. హోం క్వారంటైన్లో ఉన్నా… వారి పిల్లలకు కృష్ణా జిల్లా చెల్డెలైన్ సొసైటీ ద్వారా పునరావాసం కల్పిస్తున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం చెల్డెలైన్, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భార్యభర్తలకు కరోనా సోకి కోవిడ్ కేర్ సెంటర్, హోం ఐసోలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా… వారి పిల్లలకు సొసైటీ ద్వారా తాత్కాలికంగా సంరక్షణ కల్పిస్తామన్నారు. అటువంటి వారి కోసం 181,198 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెల్డెలైన్ నిర్వాకులు అరవ రమేష్ తెలిపారు.