వీఆర్వో షఫీపై మండిపడ్డ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: నీ మీదే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి ఇష్టముంటే పని చెయ్ లేకపోతే వెళ్ళిపోవాలని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి తెలియజేశారు.అవ్వ బాగున్నావా అన్నా బాగున్నావా అంటూ ఆయన మంచి పలకరింపులతో ముందుకు సాగారు.ఈకార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది.నిన్న ఉదయం 9:30 కు ప్రారంభమైన కార్యక్రమం ముందుగా జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే,గ్రామ సర్పంచ్ సోగరాజు మరియమ్మ భూమి పూజ చేశారు. తర్వాత ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన వివరాల నగదు గురించి వారికి తెలియజేశారు.గ్రామంలో వచ్చిన వివిధ సమస్యలపై వెంటనే మండల అధికారులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.గ్రామానికి చెందిన వృద్ధుడు పానుగంటి నాగులన్న మాతండ్రి ఆస్తి 8 ఎకరాల 50 సెంట్లు ఉందని వీటికి అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఆన్లైన్లో ఎక్కించడం లేదని అధికారుల దగ్గరికి ఎన్ని సార్లు వెళ్లిన వారు పట్టించుకోవడంలేదని ఆన్లైన్లో చేయడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విఆర్ఓ షఫీపై ఎమ్మెల్యే మండిపడ్డారు.రమణమ్మ ఇంటిదగ్గర విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని కోరారు.దళిత కాలనీలో ఉన్న నీటి కుంట ఉండటం వలన దుర్వాసన,దోమలు విపరీతంగా ఉన్నందున మేము రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. షేక్ మౌలాలి(90) అనే వృద్ధుడు మాట్లాడుతూ నాకు 65 రూపాయలు ఉన్న పెన్షన్ వస్తూ ఉండేదని గత సంవత్సరం నుంచి నాకు వచ్చే పింఛను తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.షేక్ రిజ్వాన,సాదిక్ భాషలు మాట్లాడుతూ మేము ఉండటానికి ఇల్లు లేదని సొంతం స్థలం కూడా లేదని స్థలం కావాలని ఎన్నిసార్లు అధికారులకు,ప్రజా ప్రతినిధులకు అర్జీలు ఇచ్చిన ఫలితం లేదని గ్రామంలో ఇల్లు పొలాలు ఉన్నవారికి స్థలాలు ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఎన్నో మంచి పథకాలు తీసుకువచ్చారని మరి అధికారుల తప్ప నాయకుల తప్ప అని వారు మండిపడ్డారు.కమ్మరి చంద్రశేఖర ఆచారి తనకు ఉన్న పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించడం లేదన్నారు.సుబ్బయ్యకు సర్వే నెంబర్ 520 స్థలం ఎక్కించాలన్నారు. 03.12.2020 న ఎం. విజయభారతికి జగనన్న ఇంటి స్థలం పట్టా ఇచ్చారు. సర్వే నంబర్ 292/1బి లో ప్లాట్ నెంబర్ మరియు సరిహద్దులు రాయకుండానే రెవెన్యూ అధికారులు సంతకాలు చేశారని కానీ నాకు ఇంతవరకు స్థలం చూపించలేదని అధికారులు ఇచ్చిన పట్టాను ఎమ్మెల్యేకు చూపించారు వెంటనే ఎమ్మెల్యే తహసీల్దారును మరియు వీఆర్వోను పిలిపించి మాట్లాడారు.ప్రజల నుంచి వచ్చిన సమస్యల పట్ల ఎమ్మెల్యే స్పందించి వెంటనే వివిధ శాఖల అధికారులు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ సోగరాజు మరియమ్మ, చౌటుకూరు సర్పంచ్ మదర్ సాహెబ్,రామ తులసమ్మ, చంద్రమోహన్ రెడ్డి,ఎలీషా,శ్రీనివాసులు,గోపాల్ రెడ్డి, ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఈవో ఆర్డీ ఫక్రుద్దీన్, తహసిల్దార్ సిరాజుద్దీన్,రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, ఇన్చార్జి ఎస్ఐ ఓబులేసు,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ సుకుర్,ఏఈలు విశ్వనాధ్,క్రాంతి కుమార్, ఏపీవో జయంతి,ఎపిఎం సుబ్బయ్య,వివిధ గ్రామాల నాయకులు సాదిక్ భాష,తలముడిపి వంగాల సిద్దారెడ్డి, వీరారెడ్డి,నాగన్న,ఉస్మాన్ భాష,మహేష్,ఈనాయతుల్ల, పంచాయితీ కార్యదర్శి షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.