అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు మనగుడి వేడుకలు
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఈనెల 31వ తేదీ నుండి నవంబర్ నెల 7వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు దేవాలయాల కేంద్రాలలో కర్నూలు పట్టణం, శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం, నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడ లోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 31వ తేదీ ఉదయం 6 గంటలకు శివుడికి రుద్రాభిషేకం, సాయంత్రం 6 గంటలకు హరికథా కార్యక్రమం, నవంబర్ 1వ నుండి 7వతేది వరకు ధార్మిక సప్తాహం మరియు ప్రతిరోజూ భజనలు, 7వ తేది సాయంత్రం 4 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం , కార్తీక దీపోత్సవం మరియు నవంబర్ 5 న ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు దేవాలయ కేంద్రాలలో మంగళకైశిక ద్వాదశి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ సద్గురు పరిపూర్ణ తాండవ నాగలింగ శివాచార్య శివ జీవైక్యమఠం మఠాధీశులు శ్రీశ్రీశ్రీ యల్లప్ప స్వామి, లలితా పీఠం పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, బ్రహ్మంగారి ఎనిమిదవరం మనుమడు శ్రీనొస్సం వీరం భట్లయ్య స్వామి, బళ్ళారి శ్రీ ఉమామహేశ్వర పీఠం పీఠాధిపతులు శ్రీ నిత్యానంద భారతి స్వామి, తరిగొండ వెంగమాంబ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీలిమ, పోలకల్ సర్వజ్యోతి పీఠం పీఠాధిపతులు శ్రీ రాజారత్నం స్వామి, శ్రీనీలకంఠయ్య స్వామి, శ్రీ కామధేను గోశాల వ్యవస్థాపక అధ్యక్షులు బి.శ్రీరాములు, శ్రీగోదా విష్ణు సహస్రనామ మండలి ప్రతినిధి బిలకంఠి మురళి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రఘునాథ రెడ్డి, వైద్యం గిడ్డయ్య సాహితీసేవ సమితి అధ్యక్షులు రామానాయుడు, లక్ష్మిరెడ్డి, రామాంజనేయులుతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.