పేదల డాక్టర్ పుల్లన్న ప్రథమ వర్ధంతి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూల్ నగరం జిల్లాపరిషత్ ఆవరణ లోని మండల పరిషత్ సమావేశ భవనం లో ఆదివారం ఉదయం పేదల డాక్టర్ పుల్లన్న ప్రథమ వర్ధంతికి కుటుంబ సభ్యులు స్నేహితులు, కురువ సంఘం నాయకులు కురవ కులస్తులు భారీ ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు ,గౌరవ అధ్యక్షులు కిష్టన్న అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి మాట్లాడుతూ కీర్తిశేషులు . డాక్టర్ పుల్లన్న సేవలు గూర్చి కురవ సంఘానికి చేసిన సేవలను గూర్చి అందరూ కొనియాడారు . ఈ కార్యక్రమంలోనగర మేయర్ బి .వై .రామయ్య డా .పుల్లన్న చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు .ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ పేదల డాక్టర్ డా .పుల్లన్న అని ,బి .సి .ల అభివృద్ధి కృషి చేసాడని కొనియాడారు .ఈ కార్యక్రమం లో డా .భవాని ప్రసాద్ ,మాజీ DMHO డా .శివశంకర రెడ్డి ,డా రాజయ్య డా.వెంకటరమణ ,డా .నరసరామ్ ,లు నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు .డా .భవానీప్రసాద్ మాట్లాడుతూ డా .పుల్లన్న నా జీవిత గురువు అని కొనియాడారు .కుటుంబ సభ్యులు కే .విజయలక్ష్మి ,కే .శైలజ కిరణ్ ,టి .లీల ,మిత్రులు ఎం .వి .పుల్లయ్య ,గడిగె ప్రసాద్ ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు,బి .రామకృష్ణ ,మద్దిలేటి ,అడ్వకేట్ నాగేంద్రనాథ్ యాదవ్ ,ఓ . పుల్లన్న , కే .వెంకటరమణ ,కెసి నాగన్న ,కేటి ఉరుకుందు, పాల సుంకన్న,బిల్డర్ వెంకటేశ్వర్లు ,బిల్డర్ దామోదర్ ,పర్ల శేఖర్ ,మేకల శేషన్న ,చిరంజీవి ,హుస్సేన్ ,రేమాట సర్పంచ్ కే .వెంకన్న ,ఓర్వకల్ మాజీ సర్పంచ్ పెద్దయ్య ,కే .రోంగోపాల్ ,సోమన్న , బి .సి .తిరుపాల్,బి .బాలరాజు ,బి .తరుణ్ ,,పాలగోపాల్ , ,ఎస్ .నాగన్న రాయలసీమ RVpS రాష్ట్ర సంఘం అధ్యక్షులు రవికుమార్, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష ,కార్యదర్సులు , పాల్గొన్నారు.