ఈశానేశ్వర స్వామి( స్పటిక లింగం) విశిష్టత
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఇటీవల ఏర్పాటుచేసిన ఈసానేశ్వర స్వామి (స్పటిక లింగం)ను పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ సద్గురు శంకర భారతి స్వాములవారిచే ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు ఆంజనేయస్వామి తోపాటు శ్రీ రుప్పిణి సమేత పాండురంగ స్వామి శ్రీ ఆదిశంకరాచార్యులు వారితోపాటు స్పటిక లింగం కూడా ప్రతిరోజు ప్రముఖ వేద పండితుడు ప్రధాన అర్చకులు గిరి స్వామి చేతులు మీదుగా అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పవిత్రమైన స్పటిక లింగం విశిష్టతపై చెన్నూరు బ్రాహ్మణ వీధిలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో స్పటిక లింగం ఏర్పాటు చేయాలన్న తలంపుతో సద్భా బ్రాహ్మణుల జపనీస్టతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్న బ్రాహ్మణుల చేత పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశి క్షేత్రం నుంచి తీసుకురావడం జరిగింది. స్పటిక లింగాన్ని దర్శించుకుంటే కాశి క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు అవుతుందని వేద పండితులు అంటున్నారు. ప్రతిరోజు స్పటిక లింగానికి అభిషేక పూజలు పూల అలంకరణ ప్రధాన అర్చకులు వేద పండితులు గిరి స్వామి చేతులు మీదుగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో స్పటిక లింగానికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.