పాదయాత్ర లో మళ్ళీ నువ్వే రావాలంటూ ఆశీర్వాదాలు
1 min readపల్లెవెలుగు,వెబ్ ఏలూరు: ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే , వచ్చిన సమస్య కంటే దవాఖానాకు పోతే ఎక్కడ ఎంత ఖర్చు అవుతుందో అని భయపడి సమస్యను మరింత తీవ్రతరం చేసుకునే పేద మధ్య తరగతి ప్రజల జీవన స్థితిని మారుస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు కొండంత అండగా నిలుస్తుందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 38వరోజు ఏలూరు కార్పొరేషన్ 1వ డివిజన్ కోమడవోలు సచివాలయ పరిధిలోని కోడెలులో ఆళ్ల నాని పర్యటించారు.స్థానిక కార్పొరేటర్ ఆరేపల్లి.రాధికా సత్తిబాబు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు, డివిజన్ ప్రజలు, మహిళలు ఆళ్ల నాని కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.స్థానిక పారేపల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆళ్ల నానిని వేద ఆశీర్వచనాలతో ఆశీర్వదించారు.అనంతరం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస.జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల అమలు తీరును లబ్దిదారులతో మాట్లాడుతూ స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తమ చిన్నారుల కోసం జగనన్న గోరుముద్ద నుంచి చదువుకునే పిల్లలకు అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన సహా వృద్దాప్యంలో ఉన్న అవ్వా తాతలకు ప్రతినెలా ఒకటవ తేదీనే ఇంటి వద్దకు వచ్చి వాలంటీర్లు ఫించన్ అందిస్తున్న జగనన్న సంక్షేమ పథకాల అమలు ఎంతో బాగుందని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పేదవాడికి అనారోగ్యం వస్తే ఆ ప్రాణాలను గాలిలో దీపంలా వదిలేసి పరిస్థితిని మార్చాలనే గొప్ప సంకల్పంతో ఆనాడు దివంగత మహానేత డా.వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారని అన్నారు.ఆ మహానేత మరణం తర్వాత పేద వాడిని పట్టించుకునే పాలకులే లేని తరుణంలో ప్రజలందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వ పాలనను అమలులోకి తెచ్చారని ఆళ్ల నాని అన్నారు.గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత చక్కగా అమలు చేస్తున్నారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకుండా హైదరాబాద్, బెంగుళూరు,చెన్నై వంటి ఇతర రాష్ట్రాలలోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారనిమాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు.అంతేకాకుండా ఇటీవల అదనంగా మరో 809 వైద్య చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చి మొత్తం 3255 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారని ఆళ్ల నాని తెలిపారు.చికిత్స అనంతరం కోలుకునే వరకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని ఆళ్ల నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్. నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు,గుడిదేసి శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు,వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ,నగర వైఎస్సార్ సిపి అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్,మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్,వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు MRD బలరాం, కో-అప్షన్ సభ్యులు SMR పెదబాబు,కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల,పొలిమేర దాసు, తంగేళ్ల రాము,దేవరకండ శ్రీనివాస్,జయకర్ మరియు లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు,శశిధర్ రెడ్డి, తంబీ,వైఎస్సార్ సిపి నాయకులు కిలాడి దుర్గారావు, యువజన విభాగం అధ్యక్షుడు నిడికొండ నరేంద్ర,మట్టా రాజు, పొలిమేర హరికృష్ణ, జనపరెడ్డి కృష్ణ,నున్న కిషోర్,లక్కొజు గోపి,సుల్తానా,అమీనా అన్సారీ,రేష్మ, బండారు కిరణ్,ప్రచార కమిటీ అధ్యక్షులు దాసరి రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు పొడిపిరెడ్డి నాగేశ్వరరావు,విద్యార్థి విభాగం అధ్యక్షుడు శివరావు, సేవాదళ్ అధ్యక్షుడు ఎల్లపు మోజెస్,ఐటి కొప్పుల ప్రభాకర్ రెడ్డి,తోటకూర కిషోర్, లూటుకుర్తి సుభాష్, పసుపులేటి శేషు, పిట్టా ధనుంజయ్,భారతి వెంకట రంగారావు, శ్రీనివాసరావు,యాదగిరి చిన బాబు చెల్లూరి బాబ్జి, సత్తిబాబు, రమణ, వాసు రాము నాగరాజు,యమ్మల రమణ,మునిసిపల్ కమిషనర్ షేక్ షాహీద్,ఎమ్మార్వో సోమ శేఖర్,పలు శాఖల అధికారులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు,కోమడ వోలు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.